TG Cabinet: ఈ నెల 6న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Cabinet meeting) ఈ నెల 6న జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కానుంది. బీసీ రిజర్వేషన్లు (BC Reservations) , ఎస్సీ వర్గీకరణ (SC classification) తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ (Modi)తో భేటీ అయ్యారు. పలు ప్రాజెక్టులపై చర్చించారు. వాటిపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశముంది.