Kancha Gachibowli : విద్యార్థుల ఆందోళనతో హెచ్‌సీయూ వద్ద ఉద్రికత్త

కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli) భూముల వివాదం నేపథ్యంలో హెచ్‌సీయూ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆ భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు (Students) ఆందోళనకు దిగారు. హెచ్‌సీయూ మెయిన్ గేట్ వద్దకు చేరుకుని నిరసన తెలుపుతున్నారు. మరోవైపు యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు బీజేవైఎం(BJYM), ఏబీవీపీ(ABVP), వామపక్షాల (Left parties) నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్‌లకు తరలించారు.