టీ న్యూస్ గోల్డెన్ ప్రాపర్టీ షో లో అమెరికా పత్రిక, తెలుగు టైమ్స్ సందడి

అమెరికాలో గత 18 సంవత్సరాలుగా ప్రచురితమవుతున్న తెలుగు టైమ్స్ పత్రిక టీ న్యూస్ ఛానల్ వారు మార్చి 13,14 తేదీల్లో ఏర్పాటు చేసిన గోల్డెన్ ప్రాపర్టీ షోలో ఓవర్ సీస్ మీడియా పార్టనర్ గా ఛురుకుగా పాల్గొనటమే కాక ఒక స్టాల్ ను కూడా ఏర్పాటు చేసింది. ప్రాపర్టీ షోను సందర్శించడానికి వచ్చినవారు అమెరికాలో మన తెలుగు పత్రిక దాదాపు 18 సంవత్సరాలపాటు నిరంతరాయంగా ప్రచురితమవుతుందా అని ఆశ్చర్యపోయారు. ఎంతోమంది తెలుగు టైమ్స్ పత్రిక వివరాలను అమెరికాలో ఆ పత్రిక ఎక్కడ నుంచి ప్రింట్ అవుతుంది అని వివరాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా తెలుగుటైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావ్ తెలుగు టైమ్స్ పత్రిక ఏ విధంగా అమెరికాలో ప్రచురితమవుతుందో, అమెరికాలోని తెలుగు సంఘాలకు ఏ విధంగా సేవ చేస్తోందో కూడా తెలియజేశారు. ఎప్పటికప్పుడు అమెరికాలోని మన తెలుగువాళ్ళ వార్తలను, తెలుగు సంఘాల కార్యక్రమాలను పత్రికతోపాటు www.telugutimes.net ద్వారా ఇస్తున్నామని కూడా చెప్పారు. అమెరికాలోని ప్రముఖ జాతీయ తెలుగు సంఘాలైన తానా, ఆటా, నాటా, నాట్స్ వంటి సంఘాలు నిర్వహించే మహాసభల్లో, వివిధ నగరాల్లో ఉన్న ప్రాంతీయ తెలుగు సంఘాలు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల్లో తెలుగు టైమ్స్ స్టాల్ ను ఏర్పాటు చేసేదని, మొదటిసారిగా హైదరాబాద్ లో ఈ ప్రాపర్టీ షోలో తెలుగుటైమ్స్ స్టాల్ ను ఏర్పాటు చేశామని చెన్నూరి వెంకట సుబ్బారావ్ తెలిపారు. కొత్తగా సిభా గ్రూప్ యాజమాన్యం లో తెలుగు టైమ్స్ తెలుగు రాష్ట్రాలలో వివిధ కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొంటుందని తెలిపారు.
తెలుగు టైమ్స్ జనరల్ మేనేజర్ మధుమోహన్ మాట్లాడుతూ, అమెరికాలోని ఎన్నారైలకు సన్నిహితంగా ఉన్న ఈ పత్రిక ద్వారా రియల్ ఎస్టేట్ సంస్థలు తమ ప్రాజెక్టుల వివరాలను కంటెంట్ రూపంలోకాని, అడ్వర్టయిజ్మెంట్ రూపంలో కాని ఇవ్వడం వల్ల ఎంతోమంది ఎన్నారైలకు ఆయా ప్రాజెక్టుల వివరాలు చేరుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగు టైమ్స్ న్యూస్ ఎడిటర్ గోవిందరాజన్, సబ్ ఎడిటర్ సైదులు, మార్కెటింగ్ మేనేజర్ శశాంక తదితరులు పాల్గొన్నారు.