ఎన్నారైకు హైకోర్టు లో చుక్కెదురు…

అమెరికాలో నివసిస్తున్న తనను మళ్లీ దేశం వెళ్లేందుకు అనుమతించాలని ఎన్నారై కనుమూరి వెంకట సుబ్బరాజు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. అమెరికా పౌరుడినైన తనకు నోటీసు కూడా ఇవ్వకుండా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకోవడం అన్యాయమని పేర్కొంటూ ఆయన రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారించింది. బ్యాంకుల నుంచి రుణం తీసుకొని తిరిగి చెల్లించకుండా విదేశానికి వెళ్లిపోతుంటే అనుమతించాలా? అని న్యాయస్థానం ప్రశ్నించింది.