Abu Dhabi :అబుదాబిలో తెలుగమ్మాయి అరుదైన ఘనత

గల్ఫ్ దేశం అబుదాబా (Abu Dhabi)లో తెలుగమ్మాయి అక్కినేని మౌనిక (Akkineni maunika )కు అరుదైన గౌరవం దక్కింది. అబుదాబీలో ఉంటున్న 15 ఏళ్ల మౌనిక, ప్రతిష్ఠాత్మక షేక్ జాయెద్ సస్టెయినబిలిటీ (Sheikh Zayed Sustainability )అవార్డును గెలుచుకుంది. కర్బన ఉద్గారాలను తగ్గించి, తరగతి గదిలో గాలి నాణ్యతను పెంచేలా ఆమె రూపొందించిన ఫార్ములాకు ఈ అవార్డుకు దక్కింది. మౌనిక తల్లిదండ్రులు అక్కినేని భూపేష్(Akkineni Bhupesh), స్వీటీ ఏలూరు(Eluru) నగరానికి చెందినవారు. ప్రస్తుతం వారు అబుదాబాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో అబుదాబి రాజు, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ ( యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ చేతుల మీదుగా మౌనిక ఈ అవార్డుని అందుకుంది.