Srinivas Reddy: కలెక్టర్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

రెండుపడక గదుల ఇళ్లపై తెలంగాణ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) కలెక్టర్లకు (Collectors) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంటిస్థలం లేని అర్హులకు ఇళ్లు (Houses) కేటాయించాలని ఆదేశించారు. అంతేకాకుండా అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా ఆర్థికసాయం అందిస్తామన్నారు. పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బేస్‌మెంట్ (Basement) పూర్తి చేసిన లబ్ధిదారులకు తొలి విడతగా రూ.లక్ష చెల్లించాలని కలెక్టర్లను ఆదేశించారు.