Telangana Thalli Statue: 9న తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని (Telangana Thalli Statue) ప్రతిష్ఠించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) పుట్టినరోజును పురష్కరించుకుని ఈ నెల 9న ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠాపించాలని ప్రభుత్వం కొన్ని రోజులుగా య్ధుప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. రాచరికపు హావభావాలకు భిన్నంగా వాస్తవ తెలంగాణ బహుజనుల ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) గతంలోప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిచేలా 17 అడుగుల విగ్రహాన్ని రూపొందించారు. ప్రభుత్వం ఆ విగ్రహ నమూనా ఫొటోను విడుదల చేసింది. గతంలో తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసిన ప్రొ.గంగాధర్ (Prof. Gangadhar) నేతృత్వంలో ప్రముఖ రూపశిల్పి ఎంవీ రమణారెడ్డి కాంస్య విగ్రహంగా తీర్చిదిద్దారు. ఎంవీ రమణారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ అమరజ్యోతి, సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహం రమణారెడ్డి రూపొందించినవే.