Sonia Gandhi: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్..సోనియాగాంధీ లేఖ
ఈ నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియాగాంధీ ప్రత్యేక సందేశం పంపించారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
రాష్ట్రం అభివృద్ది చెందాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు సోనియాగాంధీ తెలిపారు. ఫ్యూచర్ సిటీలో నిర్వహించే సదస్సులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడం ద్వారా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు, ప్రణాళికల్లో పాలు పంచుకునేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. మూడంచల వ్యూహంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. పట్టణ, నగర అభివృద్దితో పాటు.. గ్రామీణప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను మెరుగు పరచడమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.






