America: అమెరికాలో అగ్నిప్రమాదం.. హైదరాబాద్ యువతి మృతి
ఉన్నత చదువుల కోసం అమెరికా (America) వెళ్లిన హైదరాబాద్ యువతి ఉడుముల సహజారెడ్డి (Sahaja Reddy) (24) అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందారు. భారతకాలమానం ప్రకారం గురువారం రాత్రి అక్కడి ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటల్లో చిక్కుకుని సహజారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె మరణవార్తను జీడిమెట్ల (Jeedimetla) వెంకటాపూర్ రోడ్డులోని శ్రీనివాస కాలనీలో నివాసముంటున్న తల్లిండ్రులకు (Parents) అధికారులు అందించారు. ఉన్నత విద్య కోసం నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్లి ఆమె, ఇప్పుడు ప్రాణం కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాదంలో మునిగిపోయింది.






