Shamshabad: శంషాబాద్ ఎయిర్ పోర్టు కు బాంబు బెదిరింపు
శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్పోర్ట్ కస్టమర్ సపోర్ట్ సెంటర్ మెయిల్‌కు ఆగంతకుడు బాంబు బెదిరింపు మెయిల్ (Mail) చేశాడు. లండన్ (London) నుంచి హైదరాబాద్‌కు వచ్చే విమానంలో బాంబు ఉన్నట్లు పేర్కొన్నాడు. ఉదయం 5:25 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. సీఐఎస్ఎఫ్ అధికారులు తనిఖీలు చేపట్టి, అనుమానాస్పద వస్తువులేమీ గుర్తించలేదు. మరోవైపు కువైట్ (Kuwait) నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలోనూ బాంబు పెట్టినట్లు మెయిల్ వచ్చింది దీంతో అది హైదరాబాద్ రాకుండా తిరిగి కువైట్‌లోనే ల్యాండ్ అయింది. ఈ ఘటనలపై ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






