Mahesh Kumar Goud : ఆచరణ సాధ్యంకాని హామీలివ్వడమే బీఆర్‌ఎస్ పని : మహేశ్ కుమార్ గౌడ్

బీఆర్‌ఎస్ గత పదేళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు.గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ (BRS) ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులూ పెద్దగా ఏమీ లేవని తెలిపారు. ప్రతిపక్షాలు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. దావోస్ (Davos)లో ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లడం వల్లే పెట్టుబడిదారులకు నమ్మకం కుదిరింది. తెలంగాణ పెవిలియన్ (Telangana Pavilion) రద్దీగా మారింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థళు ముందుకొచ్చాయి. మమ్మల్ని విమర్శించే ప్రతిపక్షాలు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రజలను మభ్యపెట్టడం, ఆచరణ సాధ్యంకాని హామీలివ్వడమే బీఆర్‌ఎస్ పని. గత ప్రభుత్వ పాలనతో నెలకు రూ.ఆరున్నర వేల కోట్ల వడ్డీ కడుతున్నాం. మంచి పనులు జరుగుతున్నప్పుడు ప్రశంసించడం నేర్చుకోండి. తాజాగా రాష్ట్రానికి రానున్న పెట్టుబడులతో 50 వేల నుంచి 75 వేల ఉద్యోగాలు లభించే అవకాశముంది అని తెలిపారు.