Bhatti Vikramarka: రష్యా నుంచి వచ్చే పెట్టుబడులకు ప్రభుత్వం తరపున సహకారం : మల్లు భట్టి విక్రమార్క
రష్యా నుంచి వచ్చే పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తిగా సహకరిస్తామని రష్యా బృందానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) భరోసా ఇచ్చారు. గ్లోబల్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (జీటీటీసీఐ), వీటీబీ రష్యన్ బ్యాంక్ (Russian Bank) ప్రతినిధులు ప్రజాభవన్‌లో ఆయనతో భేటీ అయ్యారు. వ్యవసాయం, విద్యుత్తు, టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి సూచించారు. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్ర భాగాన నిలిచిందని, ఫార్మా, ఐటీ రంగాలకు హబ్‌గా ఉందని, మైనింగ్ రంగంలోనూ రాణిస్తోందని తెలిపారు.






