Janasena: జనసేన లేకుండా తెలంగాణా ఎన్డియే..? బిజేపి కీలక నిర్ణయం..?

ఆంధ్రప్రదేశ్ లో 2024 లో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో పదేళ్ల తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు అధికారం రుచి చూశారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం గౌరవప్రదమైన స్థానంలో ఉండటంతో ఆ పార్టీ కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు. కానీ తెలంగాణలో జనసేన పార్టీ పరిస్థితి ఏంటో అక్కడి కార్యకర్తలకు క్లారిటీ లేదు. ఇదే పరిస్థితి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సైతం ఉంది. కానీ బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది అనే క్లారిటీ మాత్రం టిడిపి(TDP) కార్యకర్తలకు ఎంతో కొంత ఉంది.
కానీ జనసేన పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఆ క్లారిటీ మిస్ అవుతుంది. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఫార్ములాను తెలంగాణలో కూడా అమలు చేసే అవకాశం ఉంది అనే ప్రచారం గట్టిగా జరిగింది. కానీ ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం తెలంగాణలో జనసేన పార్టీ లేకుండానే బిజెపి ముందుకు వెళ్ళవచ్చు అంటున్నాయి రాజకీయ వర్గాలు. అక్కడ తెలుగుదేశం పార్టీకి కాస్త కార్యకర్తల బలం ఉండటంతో.. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ వలన లాభ పడవచ్చని కమలం పార్టీ పెద్దలు భావిస్తున్నారు.
జనసేన పార్టీకి కార్యకర్తల బలం లేకపోవడమే కాకుండా, అక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ తో పాటుగా జనసేన పార్టీని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటుంది అనేది కూడా చెప్పలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. కాబట్టి సామాజిక వర్గాల లెక్కలు సరిపోతాయి. కానీ తెలంగాణలో మాత్రం దీనికి ఆస్కారం తక్కువ. అందుకే జనసేన పార్టీ విషయంలో బిజెపి వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం.
అయితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను ఎన్నికల ప్రచారంలో వినియోగించుకోవడమే గాని, అక్కడ జనసేన పార్టీ పోటీ వద్దు అనేది బిజెపి భావనగా కనపడుతుంది. ఇక జనసేన పార్టీ కూడా తెలంగాణ విషయంలో పెద్దగా ఫోకస్ చేయడం లేదు. సెప్టెంబర్ నుంచి ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ రాజకీయ పర్యటనలకు సిద్ధమవుతున్నారు. పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కనీసం 50 నియోజకవర్గాల్లో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
కానీ తెలంగాణ విషయంలో మాత్రం ఆయన ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ మినహా మరో నాయకుడు జనసేన పార్టీలో లేకపోవడంతో తెలంగాణలో రాజకీయ పరిస్థితి ఏంటి అనేది ఆ పార్టీ కార్యకర్తలకు క్లారిటీ లేదు. ఈ పరిస్థితులను గమనిస్తున్న బిజెపి పెద్దలు, తెలుగుదేశం పార్టీతో మాత్రమే తెలంగాణలో కలిసి ముందుకు వెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఫార్ములాను అప్లై చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.