Banakacharla: ఈ ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోం : ఉత్తమ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project) ను తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సముద్రంలో కలిసే నీళ్లే వాడుకుంటామని ఏపీ నేతలు ఎలా చెబుతారని ప్రశ్నించారు. బనకచర్లను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (Godavari River Management Board) , కేంద్ర మంత్రి సి.ఆర్. పాటిల్ (Union Minister C.R. Patil ) కు లేఖలు రాశాం. ఈ అంశంపై కేంద్ర మంత్రితో నేరుగా మాట్లాడాం. ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరాం. మా అభ్యంతరాలను కేంద్రానికి తెలియజేశాం. ఈ అంశంపై సరైన సమయంలో స్పందిస్తాం అని తెలిపారు.