Sridharbabu : సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ … కొందరు దుష్ప్రచారం : మంత్రి శ్రీధర్‌బాబు

ప్రైవేటుపరం కాబోతున్న 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కాపాడిరదని తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు (Sridharbabu) తెలిపారు. కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli ) భూముల వ్యవహారంపై ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు ఇచ్చిందన్నారు. సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పినప్పటికీ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఏఐ వీడియోలు (AI Videos) సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వీడియోలు వైరల్ చేసి దుష్ప్రచారం చేశారు. హెచ్‌సీయూ (HCU) భూములు, పరిసరాల్లో ఏనుగులు ఉన్నాయా? విద్యార్థులను ప్రభావితం చేసి ప్రభుత్వ పనులను అడ్డుకోవాలని చూస్తున్నారు. హైదరాబాద్ (Hyderabad) కు పెట్టుబడులు, ఉద్యోగాలు రావొద్దని కుట్ర చేస్తున్నారు. సెబీ నిబంధనలకు అనుగుణంగానే బాండ్ల జారీ ప్రక్రియ ఉంటుంది. ఐసీఐసీసీ నుంచి మేం ఎలాంటి లోన్లు తీసుకోలేదు. కంచ గచ్చిబౌలి భూములపై ఎలాంటి వివాదాలు లేవు. రాష్ట్ర సంక్షేమ కార్యక్రమాల కోసమే నిధులు సేకరిస్తున్నాం అని తెలిపారు.