High Court : ఐసీఎస్ అధికారి అభిషేక్ మహంతికి హైకోర్టులో ఊరట

ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతి (Abhishek Mahanti ) కి తెలంగాణ హైకోర్టు (High Court)లో ఊరట లభించింది. క్వాట్‌లో విచారణ తేలేవరకు తెలంగాణ (Telangana) నుంచి ఆయన్ను రిలీవ్ చేయవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇటీవల అభిషేక్ మహంతిని కేంద్ర హోంశాఖ ఏపీకి వెళ్లాలని ఆదేశించింది. కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన క్యాట్ (Cat)ను ఆశ్రయించారు. క్యాట్‌లో విచారణ ముగిసేవరకు రిలీవ్ చేయవద్దని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆయన పిటిషన్‌ను త్వరగా తేల్చాలని క్యాట్‌ను హైకోర్టు ఆదేశించింది. అక్కడ విచారణ లేతేవరకు తెలంగాణ నుంచి రిలీవ్ (Relief) చేయవద్దని తెలిపింది.