Harish Rao :ఈ నెల 12 వరకు హరీశ్‌రావును అరెస్ట్ చేయొద్దు : హైకోర్టు

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao)ను ఈనెల 12 వరకు అరెస్టు చేయొద్దని తెలంగాణ హైకోర్టు(High Court) ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ (Panjagutta Police Station )లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును క్వాష్ చేయాలని హరీశ్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హరీశ్‌రావు అరెస్టు చేయొద్దన్న మధ్యంత ఉత్తర్వులను పొడిగించిన న్యాయస్థానం, తదుపరి విచారణను ఫిబ్రవరి 12(February 12)కు వాయిదా వేసింది.