Telangana: తెలంగాణ శాసనసభ లో కీలక బిల్లులు

తెలంగాణ శాసనసభ లో కీలక బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో సామాజిక వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఎస్సీ (SC), వర్గీకరణ, బీసీ (BC), లకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు దేవాదాయ చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం సభ ముందుకు తీసుకొచ్చింది. ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) , బీసీ రిజర్వేషన్ల బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సభలో ప్రవేశపెట్టారు. దేవాదాయ చట్టసరవణ బిల్లును మంత్రి కొండా సురేఖ (Surekha) శాసనసభ ముందుకు తీసుకొచ్చారు. వీటితో పాటు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు పెట్టే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ తర్వాత వీటిపై పలువురు సభ్యులు మాట్లాడారు. అనంతరం ఈ బిల్లులు సభ ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు.