MLC Candidate :పట్టభద్ర ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి

శాసనమండలి కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్ర ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) అభ్యర్థిగా వి.నరేందర్ రెడ్డిని పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) ప్రకటన విడుదల చేశారు. ఈ స్థానానికి ఎన్నికల కోసం ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. ఈ నెల మూడో తేదీ నోటిఫికేషన్ జారీ కానుంది. ప్రస్తుతం ఈ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి (Jeevan Reddy) ఉన్నారు. ఆయన పోటీకి నిరాకరించడంతో అధిష్ఠానం పలువురు పేర్లను పరిశీలించి నరేందర్ రెడ్డిని ఎంపిక చేసింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఆయన విద్యాసంస్థల నిర్వాహకుడిగా ఉన్నారు.