ఖైరతాబాద్ మహాగణపతికి సీఎం రేవంత్ పూజలు

ఖైరతాబాద్‌లో 70 అడుగుల ఎత్తులో కొలువుదీరిన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి పర్వదినం సందర్భంగా దర్శించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్‌కుమార్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి, కార్పొరేటర్ విజయారెడ్డిలతో కలిసి సీఎం రేవంత్ తొలి పూజలు నిర్వహించారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ రాష్ట్రం పాడిపంటలతో కళకళ లాడాలని, ప్రశాంత వాతావరణం నెలకొనాలని వినాయకుడిని పూజించినట్లు చెప్పారు. గత సంవత్సరం పార్టీ అధ్యక్షుడి హోదాలో మహాగణపతిని దర్శించుకుంటే ఈ సంవతర్సరం ముఖ్యమంత్రి హోదాలో మహాగణపతిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.