11న తెలంగాణ బీజేపీ రెండో జాబితా

తెలంగాణలో బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా మార్చి 11న విడుదల కానుంది. ఈ నెల 10న ఢిల్లీలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై చర్చించనుంది. ఇప్పటికే 9 స్థానాలకు నేతలను ప్రకటించిన ఆ పార్టీ మిగిలిన స్థానాలపై నిర్ణయం తీసుకోనుంది. రెండో జాబితాలో ఆరు స్థానాలకు నేతల పేర్లను ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. మార్చి 13న ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముందని, ఆ తర్వాత పెండిరగ్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.
.