Budget : ఈ నెల 19న తెలంగాణ బడ్జెట్

ఈ నెల 19న తెలంగాణ బడ్జెట్ (Telangana Budget) ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ (BAC) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 13న గవర్నర్ (Governor) ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉండనుంది. 14న హోలీ (Holi) సందర్భంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 17, 18 తేదీల్లో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెల 27 వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 21 నుంచి 26 వరకు పద్దులపై చర్చ ఉండనుంది.