HCA : హెచ్‌సీఏ అవకతవకల్లో క్విడ్‌ప్రోకో : గురువారెడ్డి

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అక్రమాల వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ కవిత (Kavitha) కీలక పాత్ర పోషించారని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) కార్యదర్శి గురువారెడ్డి (Guruva Reddy) అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హెచ్‌సీఏ (HCA) అవకతవకల్లో క్విడ్‌ప్రోకో జరిగిందని ఆరోపించారు. సీఐడీ దర్యాప్తులో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. అన్ని రాష్ట్రాల అసోసియేషన్లు నిబంధనలు పాటించాలని బీసీసీఐ చెప్పింది. కోర్టుల్లో కేసులు వేస్తూ హెచ్‌సీఏ అవకతవకలకు పాల్పడిరది. కమిటీల్లో మంత్రులు ఉండొద్దని చెప్పినా బీసీసీఐ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ సబ్ కమిటీలో కేటీఆర్ కొనసాగారు. కేటీఆర్ బంధువు రాజ్ పాకాల (Raj Pakala) కు బీసీసీఐ టికెట్లు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆడిట్ రిపోర్టులోనూ అవకతవకలకు పాల్పడ్డారు. పదేళ్ల నుంచి ఒకే ఆడిట్ రిపోర్టును ప్రతిసారీ కాపీ పేస్ట్ చేసి పాస్ చేస్తున్నారు. ఏటా క్లబ్బుల అభివృద్ధికి రూ.6.10 కోట్లు ఇస్తున్నారు. టీమ్‌లు లేని క్లబ్బులకు కూడా డబ్బులు ఇచ్చారు. హెచ్‌సీఏ పరిపాలనా వ్యవహారాలకు కూడా నెలకు రూ.12 కోట్లు కేటాయించారు. నెలకు అంత ఎలా ఖర్చు చేస్తున్నారు? అని ప్రశ్నించారు.