ఇఫ్సీతో టీ-హబ్ కీలక ఒప్పందం
భారత్, ఫ్రాన్స్‌లకు చెందిన స్టార్టప్‌లకు తోడ్పాటును అందించేందుకు టీ హబ్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఇండో ఫ్రెంచ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఇఫ్సీ)తో తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో కుదిరిన అవగాహన ఒప్పందంపై రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఇఫ్సీ వ్యవస్థాపకులు సుమీత్ ఆనంద్ సంతకాలు చేవారు. ఏడాదిపాటు అమల్లో ఉండే ఈ ఒప్పందంలో భాగంగా సాంకేతిక, ఆవిష్కరణల రంగంలో ఇండో ఫ్రెంచ్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేలా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. ఫ్రెంచ్, భారత స్టార్టప్స్ మధ్య అంతరాలను తొలగించే ప్రయత్నం చేస్తారు. కాగా ఇఫ్సీ హైదరాబాద్ కార్యాలయాన్ని టీ-హబ్ ఆవరణలో ప్రారంభించారు.






