MLC : ఎమ్మెల్సీ నియామకాలపై .. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ (Kodandaram), అమీర్ అలీఖాన్ (Aamir Ali Khan) నియామకాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే (Stay) విధించింది. వారి నియమకాలను నిలివేస్తూ తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలను బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ (Dasoju Shravan), సత్యనారాయణ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించింది. తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని పేర్కొంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయడం తప్పు అని సుప్రీంకోర్టు పేర్కొంది.