Sridhar Babu: వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చే వారికి ఉజ్వల భవిష్యత్తు : మంత్రి శ్రీధర్‌బాబు
యువత సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) పిలుపునిచ్చారు. రాయదుర్గం టీ హబ్ (Tea Hub) లో నిర్వహించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ సాహసాలు చేసినప్పుడే విజయం దక్కుతుందని పేర్కొన్నారు. ఉన్నత స్థానానికి చేరుకోవాలనే లక్ష్యం పెట్టుకుని ఆ దిశగా కష్టపడాలన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల (Industries)ను ప్రోత్సహించేందుకు కొత్త విధానం తెచ్చినట్లు వివరించారు. అంకుర పరిశ్రమలు రూ.వంద కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలి. స్టార్టప్‌లకు సాయం చేసేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవాళ ప్రపంచమంతా మనవైపు చూస్తోంది. వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఇతర దేశాల్లోని అవకాశాల కోసం చూడవద్దు. ఇతర దేశాలు (Other countries) మనపై ఆధారపడే స్థితిక మనం ఎదగాలి అని అన్నారు.







