Kancha Gachibowli: కంచ గచ్చిబౌలి భూవివాదంపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు

కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli) భూముల వివాదంపై మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridhar Babu) స్పందించారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాలను శిరసావహిస్తామని ఆయన స్పష్టం చేశారు. కంచ గచ్చిబౌలి భూములు నిస్సందేహంగా ప్రభుత్వానివేనని అత్యున్నత న్యాయస్థానమే తేల్చి చెప్పిందని ఆయన చెప్పారు. “ప్రస్తుతం నకిలీ వీడియోలు, ఫొటోల ప్రభావం అన్ని వ్యవస్థలపైనా కనిపిస్తోంది. (Kancha Gachibowli) భూముల విషయం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేము. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన పోస్ట్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. నెమళ్లు జనావాసాల్లోకి రావడం సాధారణమైన విషయం. భారతీయ జనతా పార్టీ (బీజేపీ), భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కలిసి ఈ విషయంలో కుట్ర పన్నుతున్నాయని మేము భావిస్తున్నాం. రాష్ట్ర బీజేపీ నాయకులు అందించిన తప్పుడు సమాచారం ఆధారంగానే ప్రధాని మోదీ ఈ భూముల గురించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి కుట్రలు జరుగుతున్నాయి. మా ప్రభుత్వం కూల్చివేస్తే కూలిపోయేది కాదు” అని శ్రీధర్‌బాబు (Minister Sridhar Babu) ధీమా వ్యక్తం చేశారు.