Shravan Kumar : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన శ్రవణ్‌రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్‌రావు (Sravan Rao) నాలుగోసారి సిట్ (Sit) విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ (Jubilee Hills) పోలీసు స్టేషన్‌లో ఆయన్ను విచారించారు. గతేడాది మార్చి 29న శ్రవణ్‌రావు విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో పలుమార్లు సిట్ విచారణకు హాజరయ్యారు. నేడు ఆయన ఫోన్లలోని డేటాను అధికారులు రీట్రీవ్ చేస్తున్నారు. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్(Phone tapping) చేశారు. దాని వల్ల జరిగిన లబ్ధిపై అధికారులు ఆరా తీస్తున్నారు. శ్రవణ్‌రావు ఇచ్చిన వివరాలను బట్టి భవిష్యత్తులో కొందరు రాజకీయ నేతలను విచారించే అవకాశం ఉంది. గతంలో శ్రవణ్‌కుమార్ సిట్ విచారణకు హాజరైనప్పుడు ఫోన్‌ను సమర్పించాలని దర్యాప్తు అధికారులు ఆదేశించారు. అనంతరం ఆయన ఫోన్ తెచ్చినప్పటికీ అందులో ఏ సమాచారమూ లేకపోవడంతో వారు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నేడు ఫోన్లలోని డేటాను అధికారులు సేకరిస్తున్నారు.