అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న తెలుగు మహిళ
బ్రిటన్‌కు చెందిన ఆర్థిక సేవల దిగ్గజం లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ హైదరాబాద్‌లోని తమ నూతన టెక్నాలజీ సెంటర్ ఎండీ, సీఈవోగా తెలుగు మహిళ శిరీషా ఓరుగంటిని నియమించింది. ఈ నెలాఖార్లో ఆమె బాధ్యతల్ని చేపట్టనున్నారు. జేసీపెన్నీ ఇండియా నుంచి లాయిడ్స్ గ్రూప్‌లోకి శిరీష్ వస్తున్నారు. ఇప్పటిదాకా జేసీపెన్నీ ఇండియా ఎండీ, బోర్డు సభ్యురాలిగా ఆమె పనిచేశారు. అంతకుముందు భారత్‌లో జేపీ మోర్గాన్ చేజ్ (టెక్నాలజీ) ఎండీగా పనిచేసిన తొలి మహిళగా కూడా శిరీషా ఓరుగంటికి రికార్డుండటం గమనార్హం. అలాగే మాస్టర్‌కార్డ్‌లో ఆర్కిటెక్చర్, డాటా, షేర్డ్ సర్వీసెస్ విభాగాల ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షురాలిగా పని చేశారు. ఈ నేపథ్యంలో తమ ఐటీ ఆర్కిటెక్చర్, డాటా ఇంజినీరింగ్, ఫిన్‌టెక్ ఇన్నోవేషన్ విభాగాల బలోపేతానికి శిరీష అనుభవం దోహదపడగలదని లాయిడ్స్ గ్రూప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నది.






