Revanth Reddy: సీఎంను కలిసిన రాహుల్ సిప్లింగజ్, అందెశ్రీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy)ని జూబ్లీహిల్స్‌లో నివాసంలో గాయకుడు రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ప్రభుత్వం ఆయనకు రూ.కోటి నగదు ప్రోత్సాహకం అందించిన నేపథ్యంలో రాహుల్ ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రాహుల్ కు శాలువా (Shawl ) కప్పి సత్కరించారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ (Jubilee Hills) లోని ఆయన నివాసంలో ప్రముఖ కవి అందెశ్రీ (Andesri) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం అందెశ్రీకి శాలువా కప్పి సత్కరించారు.