Short Film Festival: డిసెంబర్ 19 నుంచి హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ : మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ (Short Film Festival) కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) తెలిపారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ దాదాసాహెబ్ (Dadasaheb) ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీ సంస్థ ద్వారా డిసెంబర్ 19 నుంచి 21 వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (Film Development Corporation) ద్వారా రూ.30 లక్షలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. మంత్రి ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు జీవో విడుదల చేసింది.







