Seethakka: అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు
ఇందిరమ్మ చీరల పంపిణిపై అధికారులకు మంత్రి సీతక్క (Seethakka,) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటికి ఇందిరమ్మ చీర పంపిణీ చేయాలని, గ్రామాల్లో (villages) ఇంటింటికీ వెళ్లి చీరలు పంచాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో బృంద సభ్యులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి బొట్టుపెట్టి చీరలు (Sarees) అందజేయాలన్నారు. ఎస్‌హెచ్‌జీ వెలుపల ఉన్న మహిళలకు వెంటనే సభ్యత్వం వెను వెంటనే చీర పంపిణీ చేయాలని మంత్రి తెలిపారు. మహిళా స్వయం సహాయక బృందాల ప్రాముఖ్యతపై నియోజకవర్గ (Constituency), మండల స్థాయి కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.పంపిణీ వివరాలు తప్పనిసరిగా ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాలన్నారు. ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ క్రమశిక్షణగా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు చీర అందాలన్నారు. కొత్త లబ్ధిదారుల గుర్తింపుకు పౌర సరఫరా శాఖ సహకారం తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.






