Revanth: హైదరాబాద్ అలా కాకూడదనే .. స్క్రాప్ పాలసీ : సీఎం రేవంత్

రానున్న రెండేళ్లలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నగరంలోని ఎన్టీఆర్ మార్గంలో నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ నిర్మానుష్యంగా మారకుండా ఉండేందుకే స్క్రాప్ పాలసీ (Scrap Policy) తీసుకొచ్చినట్లు తెలిపారు. అందులో భాగంగానే ఈవీలకు రిజిస్ట్రేషన్, ట్యాక్స్ ఫ్రీ చేశామన్నారు. ఆరు గ్యారంటీలకు బస్సు డ్రైవర్లు, కండక్టర్లు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారని నష్టల్లో ఉన్న ఆర్టీసీ ఇప్పుడు లాభాల్లో నడుస్తోందన్నారు. మూసీ ప్రక్షాళన జరగాలంటే ప్రజలు సహకరించాలని కోరారు. కోర్టు కేసుల చిక్కుముడులు విప్పి 55,143 ఉద్యోగాలు ఇచ్చామని ఈ సందర్భంగా సీఎం వెల్లడిరచారు.