RiteCare Clinic: హైదరాబాద్‌లో రైట్‌కేర్ క్లినిక్ బహుళ ప్రత్యేకతల వైద్య కేంద్రం ప్రారంభం

హైదరాబాద్, 3 ఆగస్టు 2025: వైద్య సేవలతో ముందంజ వేసిన రైట్‌కేర్ క్లినిక్ (RiteCare Clinic), అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన బహుళ స్పెషాలిటీ క్లినిక్‌ను ఆదివారం (ఆగస్టు 3, 2025) ఉదయం 10 గంటలకు శ్రీ అరెకపూడి గాంధీ, ఎమ్మెల్యే (శేరిలింగంపల్లి) మరియు శ్రీ జగదీశ్వర్ గౌడ్, కార్పొరేటర్ (మాదాపూర్) ముఖ్య అతిథులుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగు టైమ్స్ ఎడిటర్ సుబ్బారావు చెన్నూరి కూడా పాల్గొన్నారు.
రైట్ కేర్ క్లినిక్ ప్రారంభోత్సవ వేడుక కు ముఖ్య అతిథిగా వచ్చిన శేరిలింగంపల్లి ఏం ఎల్ ఏ, శ్రీ అరెకపూడి గాంధీ మాట్లాడుతూ ” ప్రస్తుత బిజీ జీవితంలో ఆరోగ్యం గా ఉండటం చాలా అవసరం అని, అందుకు ప్రజలు అందరూ తగు జాగర్తలు తీసుకోవాలని, అదే విధంగా ఆరోగ్యాభివృద్ధి కోసం రైట్ కేర్ క్లినిక్ లాంటి ఆరోగ్య కేంద్రాల అవసరం ఎంతో ఉంది. అమెరికా లో ఉన్నా, ఇక్కడి వారి ఆరోగ్యం కోసం ఈ క్లినిక్ ప్రారంభించిన మనోహర్ గారిని అభినందిస్తున్నాను. ఈ క్లినిక్ అభివృద్ధి చెందాలని, ఈ కాలనీ వారికి ఉపయోగ పడాలని, మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను ” అని అన్నారు.
డా. హేమలత మాట్లాడుతూ..” ప్రజలకు మంచి వైద్య సేవలు అందించే ఆశయం తో మొదలయిన రైట్ కేర్ క్లినిక్ లో నేను కూడా పని చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాతో పాటు అనుభవం ఉన్న డాక్టర్ ల సేవలతో ఈ క్లినిక్ పనిచేస్తుంది. ” అన్నారు.
డా. సంకీర్త్ మాట్లాడుతూ రైట్ కేర్ క్లినిక్ లో అందుబాటు లో ఉండే సదుపాయాలు వివరించారు.
కార్పొరేటర్ శ్రీ జగదీష్ గౌడ్ కూడా ప్రారంభోత్సవ వేడుక లో పాల్గొని, ఆరోగ్య పరీక్షలు స్వయంగా పరిశీలించి క్లినిక్ యాజమాన్యానికి, డాక్టర్లకు అభినందనలు తెలిపారు.
ఈ క్లినిక్ హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట, కేపీహెచ్‌బీ 9వ దశ, గోకుల్ ప్లాట్స్‌లో ఉన్న అంజనాద్రి భవనం, ప్లాట్ నెం. 959 & 960, AR Stay Inn సమీపంలో ప్రారంభమవుతోంది. Gopal Nagar/Hafeezpet/Gokul Plots/KPHB 9th Phase/Vasanth Nagar ఈ ప్రాంతంలో క్లినిక్ ఏర్పాటు కావడం వల్ల స్థానికులకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ క్లినిక్‌లో బాలరోగాలు (పీడియాట్రిక్స్), స్త్రీరోగాలు (గైనకాలజీ), శారీరక చికిత్స (ఫిజియోథెరపీ) సేవలు లభిస్తాయి. అతి త్వరలో మెదడు వ్యాధులు (న్యూరాలజీ), మూత్ర సంబంధిత వ్యాధులు (యూరాలజీ), జీర్ణవ్యవస్థ (గ్యాస్ట్రోఎంటరాలజీ), చెవి-ముక్కు-గొంతు (ఈఎన్టీ), షుగర్ (డయాబెటాలజీ) తదితర విభాగాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనితో ఈ క్లినిక్ సంపూర్ణ వైద్య సేవల కేంద్రంగా మారనుంది.
ఈ సందర్భంగా క్లినిక్ ప్రతినిధులు మాట్లాడుతూ –
“నిపుణుల తోడు, మానవతా దృక్పథంతో, ఒకేచోట అన్ని వైద్య సేవలను అందించడమే మా లక్ష్యం. రోగులకు నమ్మకంగా, అందుబాటులో ఉండే వైద్యం ఇవ్వాలన్నదే మా సంకల్పం” అని తెలిపారు.
రైట్‌కేర్ క్లినిక్ దృష్టి – “వైద్య నిపుణ్యానికి, రోగి శ్రేయస్సుకి ప్రాధాన్యం ఇచ్చే విధంగా సేవలందించడం.”
మరిన్ని వివరాల కోసం సంప్రదించండి:
RiteCare Clinic, Phone: +91- 4035 789 789,
WhatsApp: +91- 9115 789 789
Email: info@ritecare.in, Website: www.ritecare.in