హైదరాబాద్-బ్యాంకాక్‌కు థాయ్ ఫ్లైట్

తెలంగాణ రాష్ట్రం నుంచి బ్యాంకాక్ వెళ్లేవారి ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోడానికి థాయ్ ఎయిర్‌ఏషియా మరో విమాన సర్వీసును ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి నేరుగా బ్యాంకాక్ వెళ్లే ఈ విమాన సర్వీసును శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్‌పోర్ట్ సీఈవో ప్రదీప్ పణికర్ ప్రారంభించారు. సోమ, బుధ, శుక్ర, అదివారాల్లో ఈ విమాన సర్వీసు నడవనున్నదని ఆయన వెల్లడిరచారు. హైదరాబాద్‌లో రాత్రి 11:25 గంటలకు బయలుదేరనున్న ఈ విమాన సర్వీసు ఆ మరుసటి రోజు ఉదయం 4:30 గంటలకు బ్యాంకాక్ చేరుకోనున్నది. తిరిగి ప్రయాణంలో బ్యాంక్‌లో రాత్రి 8:50 గంటలకు బయలుదేరి అదేరోజు రాత్రి 10:55 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నది.