Revanth Reddy: దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో : రేవంత్ రెడ్డి
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల్లో వినియోగదారులకు సన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వివరించారు. తాజ్‌కృష్ణలో కేంద్రమంత్రితో ముఖ్యమంత్రి రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సన్న బియ్యం ( rice) పంపిణీ విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు తినే బియ్యాన్ని సరఫరా చేస్తేనే సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరుతుందని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ (Telangana)లాగే కేంద్రం కూడా దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ అంశాన్ని పరిశీలించాలని కేంద్రమంత్రి కోరారు. అవసరమైతే అధ్యయనం చేసి తగు నిర్ణయం తీసుకోవాలని వినతి చేశారు. దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. పూర్తిస్థాయి అధ్యయనం తర్వాత పరిశీలించి దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణిపై నిర్ణయం తీసుకుంటామని ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.






