Revanth Reddy: ఏ పార్టీ అయినా స్వాతంత్య్రం తర్వాతే : సీఎం రేవంత్ రెడ్డి
దళితులు, ఆదివాసీల సంక్షేమం కోసం కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఢల్లీిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సులో ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, బీజేపీ (BJP) , బీఆర్ఎస్, జేడీ, బీజేడీ, ఆరేజేడీ (RJD) ఏ పార్టీ అయినా స్వాతంత్య్రం తర్వాతే వచ్చాయని తెలిపారు. ఇతర పార్టీలు ఎన్నికల్లో గెలిస్తే కూర్చీల్లో, ఓడితే ఇంట్లో కూర్చుంటాయి. ఎన్నికల్లో ఓడినా, గెలిచినా ప్రజల మధ్యే ఉన్న పార్టీ కాంగ్రెస్, మోదీ నేతృత్వంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. 11 ఏళ్లుగా సామాజిక న్యాయం కోసం ఆలోచించట్లేదు. వక్రమార్గంలో ఉన్న నేతలను రెండు చెంపదెబ్బలు కొట్టయినా దారిలోకి తెచ్చేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోంది. మా పార్టీ దేశానికి ఏం చేసిందని విమర్శిస్తున్నారు. 140 ఏళ్ల క్రితం దేశ ప్రజల స్వాతంత్రం కోసం కదం తొక్కింది. ఆంగ్లేయులను ఓడిరచింది. భారత్ నుంచి ఉగ్రవాదులను పారద్రోలేందుకు ఇందిరాగాంధీ (Indira Gandhi) కృషి చేశారు. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ (Rajiv Gandhi) అమరులయ్యారు. యూపీఏ -1 సమయంలో సోనియాగాంధీ ప్రధాని కావాలని అందరూ కోరారు. కానీ ప్రధాని పదవిని ఆమె త్యాగం చేశారు అని అన్నారు. 2004లోనే రాహుల్‌గాంధీ కేంద్ర మంత్రి అయ్యేవారు. ఆయన కోరుకుంటే 2009లోనే ప్రధాని అయ్యేవారు. కానీ ప్రధాని, కేంద్ర మంత్రి పదవులు పార్టీ సీనియర్ నేతలకు ఇచ్చారు. వచ్చే లోక్‌సభ (Lok Sabha ) ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ పోరాడతారు. బీజేపీకి 150 సీట్లు దాటకుండా చూస్తాం అని తెలిపారు.







