Revanth Reddy :ఆ నివేదిక ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేయాలి : సీఎం రేవంత్

బీసీ సంక్షేమ సంఘం (BC Welfare Association) జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఢల్లీి జంతర్‌మంతర్ (Jantar Mantar) వేదికగా బీసీ సంఘాల ధర్నా కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడారు. బీసీల గొంతు వినిపించడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. జనాభా ఎంతో తెలియకుండా రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదని కోర్టులు చెప్పాయి. స్థానిక సంస్థలు, చట్ట సభల్లో రిజర్వేషన్లు (Reservations) కావాలంటే జనాభా తేవాలి. జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ (Congress Party) నిర్ణయం తీసుకుంది. దామాషా ప్రకారం నిధులు, నియామకాలు చేపట్టాలనేది మా పార్టీ నిర్ణయం. బీసీలను బలపర్చాలనే ఆలోచనకు బీజేపీ వ్యతిరేకం. బీసీల లెక్కలు తేల్చాల్సి వస్తుందని 2021 జనాభా లెక్కలను వాయిదా వేశారు. జనగణనతోపాటు కులగణన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఆ నివేదిక ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేయాలి అని అన్నారు.