Revanth Reddy :ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదు : సీఎం రేవంత్ రెడ్డి

ఆదివారం నుంచి నాలుగు కొత్త పథకాలు ప్రారంభిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ పథకాలను ఆదివారం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(Command Control Center)లో మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. గ్రామాల్లోని లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిజమైన లబ్ధిదారుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగవద్దని సూచించారు. అనర్హులకు లబ్ధి చేకూరిస్తే ఆయా అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు(Nageswara Rao), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.