Revanth Reddy: దేశానికి ఆదర్శంగా నిలిచేలా తెలంగాణలో : సీఎం రేవంత్ రెడ్డి

దేశానికి ఆదర్శంగా నిలిచేలా తెలంగాణలో కులగణన జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢల్లీిలోని జంతర్‌మంతర్ (Jantar Mantar) వద్ద జరిగిన బీసీ ధర్నాలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కులగణన జరగాలని భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra ) లో రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆశయం మేరకు మేం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు తెచ్చాం. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ (Assembly ) లో బిల్లు ఆమోదించాం. అసెంబ్లీ పంపిన బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండిరగ్‌లో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును ఆమోదించాలని రాష్ట్రపతిని కోరుతున్నాం. రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని అపాయింట్‌మెంట్ కోరాం. ఇప్పటి వరకూ రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ దొరకలేదు. మాకు అపాయింట్‌మెంట్ ఇవ్వొద్దని రాష్ట్రపతిపై మోదీ ఒత్తిడి చేశారని మా అనుమానం. బిల్లును ఆమోదించే వరకు మా పోరాటం కొనసాగుతోంది అని అన్నారు.