Congress: ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో సీఏం రేవంత్, కీలక నేతల భేటీ

తెలంగాణ కాంగ్రెస్ (Congress) కీలక నేతలు ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో ఆ పార్టీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ (Congress) ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో తెలంగాణ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, కేబినెట్ విస్తరణపై ప్రధానంగా చర్చలు జరిగినట్లు సమాచారం. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు, ప్రజాసంప్రదాయ కార్యక్రమాల పురోగతిని కూడా ఏఐసీసీ (Congress) పెద్దలకు రాష్ట్ర నేతలు వివరించినట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణపై కూడా భేటీలో ప్రధానంగా చర్చించినట్లు (Congress) పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం ఉగాది నాటికి మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. భేటీలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా (Congress) రాష్ట్ర నేతలు అధిష్ఠానానికి నివేదిక ఇచ్చారు.