Revanth Reddy :ఐలమ్మ వర్సిటీ విద్యార్థినులు .. అంతర్జాతీయ వర్సిటీలతో : రేవంత్ రెడ్డి

కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ (Chakali Ailamma Women’s University ) లో నూతన భవన నిర్మాణాలు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఐలమ్మ వర్సిటీ (Ailamma University) విద్యార్థినులు అంతర్జాతీయ వర్సిటీల (International University )తో పోటీ పడాలి. మహిళలకు అవకాశం ఇస్తే నిరూపించుకుంటున్నారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. స్వయం సహాయక సంఘాల ద్వారా 100 ఎలక్ట్రిక్ బస్సులు కొని ఆర్టీసీకి ఇస్తున్నాం. ప్రభుత్వానికి సోలార్ విద్యుత్ సరఫరా చేసే విధంగా మహిళా సంఘాలతో ఒప్పందం చేసుకున్నాం. అదానీ(Adani), అంబాల(Ambani) నీతో మహిళలు పోటీ పడే విధంగా వ్వాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నాం. మహిళలు రాణించాలంటే చదువుకోవాలి అని అన్నారు.