Indiramma Sarees: ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ఇందిరమ్మ చీరల (Indiramma Sarees) పంపిణీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు. పలువురు మహిళలకు చీరలను సీఎం పంపిణీ చేశారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అంతకుముందు నెక్లెస్ రోడ్లో ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రి పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. నేటి నుంచి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం ( డిసెంబర్ 9) నాటికి గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. రెండో దశలో మార్చి 1 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) వరకు పట్టణ ప్రాంతాల్లో అందజేయనున్నారు.






