Revanth Reddy: బీఆరెస్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్

పేరు బంధం తెంచుకున్న బీఆరెస్ (BRS) పేగు బంధం కూడా తెంచుకుందా.. మీరెందుకు మోదీతో అంటకాగుతున్నారు? ఇవాళ ఈ ధర్నాకు మీరెందుకు రాలేదని బీఆరెస్ ని అడుగుతున్నా. బీజేపీ (BJP) వాళ్లు మోదీ మోచేతి నీళ్లు తాగుతుండొచ్చు.. కానీ బీఆరెస్ వాళ్ళు మోదీ చెప్పులు మోసి బతుకుతున్నారా? ఎన్నికల కమిషన్ కలవడానికి ఢిల్లీ వచ్చానని ఓ సన్నాసినిన్న మాట్లాడిండు.. రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ లో డ్రామా చేస్తుండని నన్ను విమర్శిస్తున్నాడు.
ఆయన పేరు డ్రామారావు.. డ్రామా నీ ఇంట్లో ఉంది.. నీ ఒంట్లో ఉంది.. నీ రక్తంలో ఉంది.. ని పేరులో ఉంది. మీ మొత్తం కుటుంబమే డ్రామాలు వేసి బతికే కుటుంబం. మాకు డ్రామాలు అవసరం లేదు.. మాకు చిత్తశుద్ధి ఉంది. అందుకే కులగణన నిర్వహించాం. వందేళ్ల సమస్యకు ఒక్క ఏడాదిలోనే పరిష్కారం చూపించాం. నువ్వా మా చిత్తశుద్ధిని శంకించేది. మీ ఇంట్లోనే ఒకరు బీసీకి అనుకూలమంటే ఒకరు వ్యతిరేకమంటున్నారు.. అటు ఇటు కానివాళ్ళు కూడా నా గురించి మాట్లాడుతున్నరు.