Harish Rao :మాజీ మంత్రి హరీశ్‌రావు కు హైకోర్టులో ఊరట

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) కు హైకోర్టు లో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు ఆయనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. స్థిరాస్థి వ్యాపారి చక్రధరగౌడ్ (Chakradhara Gowda) ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు హరీశ్‌రావుతో పాటు రాధాకిషన్‌రావు (Radhakishan Rao)పై కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో వారిద్దరినీ నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఇరువైపుల వాదనలు ఇప్పటికే ముగియగా, నేడు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ హైకోర్టు (High Court ) ఉత్తర్వులు జారీ చేసింది.