Sridhar Babu : అయిచి తో ద్వైపాక్షిక సంబంధాలకు సిద్ధం

జపాన్‌లోని అయిచి రాష్ట్రం ( ప్రిఫెక్చర్) తో ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలకు తెలంగాణ ఆహ్వానం పలుకుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Sridhar babu) వెల్లడిరచారు. సచివాయంలో అయిచి రాష్ట్ర ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాలు వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. అయిచీ రాష్ట్రం టొయోటా కార్ల (Cars )పరిశ్రమతో పాటు, ఏరోస్పేస్, ఆటోమొబైల్, రోబోటిక్స్, యంత్ర పరికరాల తయారీలో అగ్రగామిగా ఉంది. ఇటీవలే ఆ రాష్ట్రం స్టేషన్ ఏఐ(AI)పేరుతో జపాన్‌లోని అతిపెద్ద అంకుర సంస్థల ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ప్రారంభించింది.
తెలంగాణలోని టీహబ్ (T Hub)కూడా అంకుర సంస్థల ప్రోత్సాహంలో దేశంలో ప్రముఖంగా నిలుస్తోంది అని శ్రీధర్ బాబు తెలిపారు. అయిచీ అసెంబ్లీ సభ్యుడు, ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన హిరోహిట్ కొండో (Hirohit Kondo )2026లో తమ రాష్ట్రంలో జరిగే 20వ ఆసియా క్రీడలకు శ్రీధర్‌బాబును ఆహ్వానించారు. అక్కడి గిబ్లి యానిమేషన్ పార్క్ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆహ్వానిస్తోందని కొండో, మంత్రి దృష్టికి తెచ్చారు. ద్వైపాక్షిక సంబంధాలతో ఇరుప్రాంతాలు ప్రయోజనం పొందేలా సహకారం కొనసాగించాలని ఆకాంక్షించారు.