KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు రాఖీ కట్టిన సోదరీమణులు

ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ (KCR)కు ఆయన సోదరీమణులు రాఖీ (Rakhi) కట్టారు. అక్కాచెల్లెళ్లు కలిసి కేసీఆర్‌కు హారతి పట్టి, రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి ఆశీర్వదించారు. ఈ రాఖీ వేడుకల్లో కేసీఆర్ సతీమణి శోభ (Shobha), అక్కలు లక్ష్మీబాయి (Lakshmibai), జయమ్మ(Jayamma) , చెల్లెలు వినోదమ్మ పాల్గొన్నారు.