Revanth Reddy : సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీలు కట్టిన మహిళా మంత్రులు
రక్షాబంధన్ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy ) కి మహిళా మంత్రులు రాఖీలు కట్టారు. మంత్రులు కొండా సురేఖ(Konda Surekha) , సీతక్క, పార్టీ నేతలు తదితరులు రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkat Reddy), స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) తదితరులకు మంత్రి సీతక్క(Seethakka) రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు.







