Raja Singh : బీజేపీ ప్రభుత్వం రావాలంటే .. పాత సామాను పార్టీ నుంచి

సొంత పార్టీ నేతలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ (BJP) ప్రభుత్వం రావాలంటే పాత సామాను పార్టీ నుంచి బయటికెళ్లిపోవాలి. కొందరు బీజేపీ నేతలు తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే వాళ్లతో రహస్యంగా సమావేశమవుతున్నారు. రహస్య సమావేశాలు (Secret meetings) పెట్టుకుంటే రాష్ట్రంలో మన ప్రభుత్వం వస్తుందా? అని ప్రశ్నించారు. జాతీయ నాయకత్వం కూడా ఆలోచన చేయాలి. గొప్పలు చెప్పుకొనే వాళ్లకు రిటైర్‌మెంట్ (Retirement) ఇస్తేనే పార్టీకి మంచి రోజులు. నేనొక్కణ్నే కాదు, ప్రతి బీజేపీ నాయకుడు, కార్యకర్తలు ఇదే కోరుకుంటున్నారు అని అన్నారు.