Rahul Sipligunj: సీఎం రేవంత్‌ను ఆహ్వానించిన రాహుల్ సిప్లింగజ్
గాయకుడు రాహుల్ సిఫ్లిగంజ్ (Rahul Sipligunj) అతి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కాబోయ భార్య హరిణ్య (Harinya) తో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని మంగళవారం సాయంత్రం మీట్ అయ్యారు. తమ వివాహానికి ఆహ్వానిస్తూ పెళ్లి (Wedding) శుభలేఖను అందించారు. రాహుల్ హరిణ్యల వివాహం ఈనెల 27న జరగనుంది. వీరిద్దరికీ ఆగస్టులో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. టీడీపీ నేత, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి (Kotamreddy Srinivasulu Reddy) సోదరుడి కుమార్తె హరిణ్యా రెడ్డి.






